కృష్ణా జిల్లాలో ఆటోను ఢీకొట్టిన లారీ.. ఆరుగురి దుర్మరణం

  • తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురు
  • నూజివీడు మండలంలోని గొల్లపల్లి వద్ద ఘటన
  • బాధితులు నూజివీడు లయన్ తండాకు చెందిన కూలీలు
కృష్ణా జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను విజయవాడ, నూజీవీడు ఆసుపత్రులకు తరలించారు. బాధితులను నూజీవీడు లయన్ తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Krishna District
Nuziveedu
Road Accident

More Telugu News